బిజినెస్

ఆగని డిమాండ్ - పెరుగుతున్న బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: బంగారానికి దేశంలో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. విదేశీ మదుపరులతోపాటు, దేశీయ పెట్టుబడిదారులు కూడా బంగారం వైపే మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు శ్రావణ మాసం కావడంతో పండుగలు, పెళ్లిళ్లతో దేశం మొత్తం కళకళలాడుతున్నది. మదుపురులు పెరగడం, ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో, బంగారం ధర పరుగులు తీస్తున్నది. జాతీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర మంగళవారం మరో 150 రూపాయలు పెరిగి, 31,150 రూపాయలకు చేరుకుంది. పసిడి మార్గంలోనే వెండి కూడా పయనిస్తున్నది. కిలో వెండి మంగళవారం 170 రూపాయలు పెరిగి, 38,470 రూపాయలకు చేరింది.