బిజినెస్

సరికొత్త జీవనకాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 29: రూపాయి విలువ మరోసారి బుధవారం జీవనకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఇంట్రా-డేలో 70.65 స్థాయికి దిగజారింది. నెల చివర అయినందున దిగుమతిదారులు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ భారీగా పెరగడం వల్ల రూపాయి మారకం విలువ పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 49 పైసలు (0.70 శాతం) పడిపోయి, 70.59 వద్ద ముగిసింది. ఆగస్టు 13 తరువాత రూపాయి విలువ ఒకే రోజు ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఆగస్టు 13న రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 110 పైసలు (1.6 శాతం) పడిపోయింది. సోమవారం రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 70.16 వద్ద ముగిసింది. బుధవారం అంతకన్నా దిగజారి, సరికొత్త జీవన కాల కనిష్ట స్థాయి ముగింపు 70.59కి చేరింది.