బిజినెస్

రూ.50 కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టిన వారిపై చర్యలేమి తీసుకున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని పలు బ్యాంకుల నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా రుణం తీసుకుని ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ, కేంద్ర గణాంక, పథకం అమలు మంత్రిత్వ శాఖలను కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్నించింది. 50 కోట్లు, అంతకంటే ఎక్కువగా బ్యాంకుల నుంచి రుణం పొంది ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టిన కొంతమంది వ్యక్తులు, సంస్థల వల్ల పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని రైతుల పరిస్థితి సమాజంలో అధ్వాన్నంగా ఉందన్న విషయాన్ని కేంద్ర సమాచార కమిషనర్ శ్రీ్ధర్ ఆచార్యులు ప్రస్తావించారు. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా అప్పులు తీసుకుంటున్న వ్యక్తులకు ఏకమొత్తంలో తిరిగి చెల్లించే సమయంలో వడ్డీని రద్దు చేయడం వంటి అంశాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు సమకూర్చేందుకు బ్యాంకర్లు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 1998 నుంచి 2018 మధ్యకాలంలో దేశంలో 30వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వీరంతా భూమిని నమ్ముకుని బతికారని, వ్యవసాయమే ధ్యేయంగా పనిచేస్తూ మరణించారని అన్నారు. అయితే, దాదాపు ఏడువేల మందికి పైగా విద్యావంతులైన కార్పొరేట్ పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు దోచుకుని దేశాన్ని నిలువునా ముంచారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రభుత్వంలోని అన్ని విభాగాలు చొరవ తీసుకుని ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు. 50 కోట్లకు పైగా రుణం పొంది ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టిన వ్యక్తులు, సంస్థల వివరాలను సామాన్య ప్రజలకు తెలియజేయడం ద్వారా భవిష్యత్తులో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేవారం అవుతామని ఆయన అభిప్రాయపడ్డారు.