బిజినెస్

ఆగని రూపాయి పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 30: రూపాయి మారకం విలువ గురువారం మరింత పడిపోయింది. చమురు దిగుమతిదారుల నుంచి డాలర్‌కు గట్టి డిమాండ్ ఏర్పడటంతో పాటు ముడి చమురు ధరలు పెరుగుతుండటం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 15 పైసలు తగ్గి, సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 70.74 వద్ద ముగిసింది. గురువారం ఉదయం తొలి లావాదేవీలలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రా-డే జీవనకాల కనిష్ట స్థాయి 70.90 మార్కును తాకింది. రూపాయి విలువ ఇంతగా పతనం అవుతుందని కొన్ని వారాల ముందు అసలు ఎవరూ ఊహించనే లేదు. అయితే, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మధ్య మధ్యలో వివిధ స్థాయిల వద్ద జోక్యం చేసుకోవడం వల్ల రూపాయి మారకం విలువ మరింత పతనం కాకుండా నిలిచిపోవడంతో పాటు లావాదేవీలు ముగింపు దశకు వస్తున్న కొద్దీ పుంజుకుంది. నెల చివర కావడం వల్ల దిగుమతిదారుల నుంచి ముఖ్యంగా చమురు దిగుమతిదారుల నుంచి డాలర్‌కు గట్టి డిమాండ్ ఏర్పడటంతో రూపాయి మారకం విలువ పడిపోయింది.