బిజినెస్

బ్రిటన్‌ను వెనక్కి నెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత్ వచ్చే సంవత్సరం బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలో వినియోగం పెరుగుతుండటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయని, అందువల్ల భారత్ ఈ మైలురాయిని చేరుకుంటుందని ఆయన వివరించారు. రానున్న పది నుంచి 20 ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు అగ్ర శ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అవతరిస్తుందన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఇండియా (సీసీఐ) కార్యాలయ భవనాన్ని జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పరిమాణం రీత్యా చూస్తే ఈ సంవత్సరం మనం ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టాం. వచ్చే సంవత్సరం మనం బ్రిటన్‌ను వెనక్కి నెట్టే అవకాశం ఉంది. అందువల్ల మనం ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం’ అని అన్నారు. భారత దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2017వ సంవత్సరం చివరి నాటికి 2.597 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరం 2.582 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగి ఉన్న ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టింది. అయితే, తలసరి జీడీపీ రీత్యా చూస్తే భారత్ ఇప్పటికీ ఫ్రాన్స్‌కన్నా చాలా వెనుకబడి ఉంది. తలసరి జీడీపీలో భారత్‌తో పోలిస్తే ఫ్రాన్స్ 20 రెట్లు పెద్దదిగా ఉంది. భారత్ జనాభా చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఫ్రాన్స్ జనాభా 6.7 కోట్లు ఉండగా, భారత్ జనాభా సుమారు 134 కోట్లు ఉంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2017 చివరి నాటికి 2.94 ట్రిలియన్ డాలర్లు ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి రేటు సాధించింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం, రుతు పవనాలు బాగుండటం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా. భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ వృద్ధి రేటుతో సాగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలను వెనక్కి నెట్టే సామర్థ్యం భారత్‌కు ఉందని జైట్లీ అన్నారు. ‘మన దేశం సరాసరిగా 7-8 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోంది. అందువల్ల మనం వారిని వెనక్కి నెట్టగలం. 2030-40 నాటికి మనం ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటాము’ అని జైట్లీ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తుండటం వల్ల వృద్ధి రేటు పెరుగుతోందని ఆయన అన్నారు.