బిజినెస్

గత వారంలో సాధించిన లాభాలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 9: కార్పొరేట్ ఫలితాల వెల్లడి సీజన్ వచ్చేవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపరులు ఆచి తూచి వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం అంతకు ముందు వారంలో ఆర్జించిన లాభాలు మొత్తం కోల్పోవడమే కాకుండా స్వల్ప నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 18 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయింది. అయితే ఇప్పటివరకు రుతుపవనాలు సగటుకన్నా మించి ఉండడం, వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చాలాకాలంగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఆమోదం పొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉండడం మార్కెట్‌ను ఇప్పటికీ లాభాల బాటలో పరుగులు తీయించగల అంశాలుగా ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించారు. ఈ నెల 15న ఇన్ఫోసిస్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో వచ్చేవారం అదికారికంగా కార్పొరేట్ ఫలితాల వెల్లడి సీజన్ ప్రారంభం కానుంది. వారం ప్రారంభంలో 27,034 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ బ్రెగ్జిట్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు గణనీయంగా కోలుకున్న నేపథ్యంలో కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 8 నెలల గరిష్ఠస్థాయి అయిన 27,385.66 పాయింట్లను తాకింది. అయితే ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని ఒక దశలో 27,034 పాయింట్ల కనిష్టానికి పడిపోయినా చివరికి వారాంతానికి 27,126.90 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే అంతకు ముందు వారంతో పోలిస్తే 18 పాయింట్లు నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 5.15 పాయింట్లు నష్టపోయి 8,323.20 పాయింట్ల వద్ద ముగిసింది. ఎంతో ఆర్భాటంగా ప్రచారమైన కేంద్రమంత్రి వర్గ విస్తరణ మదుపరులను కదిలించలేక పోయింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 16 కంపెనీల షేర్లు నష్టపోగా, 14 కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
అదే బాటలో రూపాయి
కాగా, స్టాక్ మార్కెట్ల బాటలోనే డాలరుతో రూపాయి కూడా గత వారం అంతకు ముందు వారం ఆర్జించిన లాభాలన్నిటినీ కోల్పోయి చివరికి అయిదు పైసలు నష్టపోయింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ భారీగా పతనం కావడం లాంటి అనిశ్చితి పరిస్థితుల కారణంగా బ్యాంకులు, దిగుమతిదారులనుంచి డాలర్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. కార్పొరేట్ ఫలితాల వెల్లడి కానున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో మార్కెట్లు గత వారం ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.