క్రీడాభూమి

ఉత్తరాఖండ్ అభివృద్ధికి పెట్టుబడిదారులతో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, సెప్టెంబర్ 1: ఉత్తరాఖండ్ అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆశిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. భారీ ఎత్తున పెట్టుబడులను రాబట్టేందుకు వీలుగా అక్టోబర్ 7-8 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ హిమాలయ పర్వత ప్రాంతాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతారని, ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచే బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించనున్నామని ఆయన తెలిపారు.
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లో టెలీకమ్యూనికేషన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృత చేసేందుకు ఇప్పటికే తగిన హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆతిధ్య, పర్యాటక రంగాలతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన ముఖేష్ భట్, విశాల్ భరద్వాజ్ వంటివారు సైతం ఇక్కడ షూటింగ్‌ల కోసం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలిపారు.