బిజినెస్

ఆరో వారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాణించిన పవర్, లోహ, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, టెక్నాలజీ, వాహన, బ్యాంకింగ్ షేర్లు
* ఈ వారం మార్కెట్ సరళిపై సమీక్ష
ముంబయి, సెప్టెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో వారం లాభాల్లో ముగిశాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 393.27 పాయింట్లు పుంజుకొని 38,645.07 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 123.40 పాయింట్లు పెరిగి, 11,680.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఆగస్టు నెల ఎఫ్‌అండ్‌ఓల కాలపరిమితి ఈ వారంలోనే ముగియడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటం, ద్రవ్య లోటు పెరుగుతుందనే ఆందోళనలు నెలకొనడం మధ్య డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం అవుతుండటం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, విస్తృత స్థాయిలో వచ్చిన ర్యాలీ కారణంగా ఈ వారంలో మార్కెట్ కీలక సూచీలు పుంజుకున్నాయి.
అమెరికా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే విషయంలో క్రమపద్ధతిలో ముందుకు సాగుతామని ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్స్ చేసిన ప్రకటన వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహపూరితమయిన వాతావరణం నెలకొంది. దాని సానుకూల ప్రభావం వల్ల ఈ వారం తొలి రెండు రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా బలపడి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. అమెరికా-మెక్సికో వాణిజ్య ఒప్పందం పునరుద్ధరణ తరువాత ఏర్పడిన సానుకూల ప్రపంచ పరిణామాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడులు గణనీయ స్థాయిలో వచ్చాయి. తరువాత ముడి చమురు ధరలు పెరుగుతుండటం వల్ల రూపాయి విలువ పతనం అవుతుండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో మొదటిసారి 71 మార్కుకు దిగజారడంతో పాటు ద్రవ్య లోటు పెరుగుతుందనే ఆందోళన మదుపరులను వెంటాడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి అయ్యే సరుకులపై సుంకాన్ని మరింతగా పెంచడానికి సిద్ధం అవుతున్నారని వచ్చిన వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లను మరింత దెబ్బతీశాయి. మార్కెట్లలో నెలకొన్న అప్రమత్త వాతావరణంతో పాటు ఆగస్టు నెల ఎఫ్‌అండ్‌ఓ ఆప్షన్ గడువు ఈ వారంలోనే ముగియడంతో చివరి మూడు రోజుల్లో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అయితే ఫండమెంటల్‌లు పటిష్టంగా ఉన్న కీలక సూచీలోని ప్రధాన సంస్థల స్టాక్‌లకు కొనుగోళ్ల మద్దతు లభించడం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోకుండా లాభాల్లో ముగియడానికి దోహదపడింది.
బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారం 38,472.90 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, ఆల్ టైమ్ హై 38,989.65 పాయింట్లు, కనిష్ట స్థాయి 38,562.21 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 393.27 పాయింట్ల (1.03 శాతం) ఎగువన 38,645.07 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం అయిదు వారాలలో కలిపి 1,980.70 పాయింట్లు (5.43 శాతం) పుంజుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఈ వారం 11,605.85 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,760.20, కనిష్ట స్థాయి 11,595.60 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 123.40 పాయింట్ల (1.07 శాతం) ఎగువన, 11,680.50 పాయింట్ల వద్ద ముగిసింది. పవర్, మెటల్, ఐటీ, హెల్త్‌కేర్, టెక్నాలజి, పీఎస్‌యూలు, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఐపీఓలు, వాహన, బ్యాంకింగ్, స్థిరాస్తి, చమురు- సహజ వాయువు, వినియోగ వస్తువుల రంగాల షేర్లకు ఈ వారం కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్ల ధరలు కూడా ఈ వారంలో పెరిగాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో నికరంగా రూ. 430.43 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.