బిజినెస్

కోర్టును తప్పుదోవబట్టిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పెండింగ్ కేసుకు సంబంధించి కోర్టును తప్పుదోవబట్టించే విధంగా ఆదాయం పన్ను శాఖ వ్యవహరించినందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు విహారయాత్ర స్థలం కాదని కోర్టు పేర్కొంది. జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఆదాయం పన్ను శాఖ రూ.10లక్షలను వచ్చే నాలుగు వారాల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ సొమ్మును సుప్రీంకోర్టు లీగల్ సర్వీసస్ కమిటీలో డిపాజిట్ చేయాలని పేర్కొంది. ఈ నిధులతో జువెనైల్ జస్టిస్ అంశాలకు వినియోగిస్తామని కోర్టు పేర్కొంది. కేంద్రం ఈ వ్యవహారాన్ని తాత్సారంగా స్వీకరించిందన్నారు. తాము ఇచ్చిన ఆదేశంపై వివరాలను 596 ఆలస్యంగా ఫైలు చేసిందని, పైగా ఈ అఫిడవిట్‌లో సరైన సమాచారం లేదని పేర్కొంది. మరోసారి వివరాలను తెలియచేయడంలో జాప్యం చేయరాదని కోర్టు పేర్కొంది. వివరాల్లోకి వెళితే అలహాబాద్ హైకోర్టు ఇన్‌కమ్ టాక్స్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన తీర్పు సమర్థనీయమంటూ ఐటి శాఖ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తూ 2016 ఆగస్టు 29వ తేదీన తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఆదాయం పన్ను శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌పీడీఏ అనే సంస్థను యూపీ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ చట్టం 1973 కింద ఏర్పాటు చేశారు. 1961 ఆదాయం పన్ను చట్టం కింద తమను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ సంస్థ ఘాజియాబాద్ ఐటి కమిషనర్‌కు దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును 2006లో ఐటి కమిషనర్ తిరస్కరించారు. చారిటబుల్ పనుల నిమిత్తం హెచ్‌పీడీఏ పనిచేయడం లేదనే కారణాలపై దరఖాస్తును తిరస్కరించారు.
అనంతరం హెచ్‌పీడీఏ ఐటీ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించగా అనుమతించింది. ఈసంస్ధకు రిజిస్ట్రేషన్ చేసేందుకు తగిన అర్హతలు ఉన్నాయని అథారిటీ పేర్కొంది. కాగా అలహాబాద్ హైకోర్టును ఐటి శాఖ ఆశ్రయించింది. వీరి పిటిషన్ డిస్మిసైంది. అనంతరం ఘాజియాబాద్ ఐటి కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటువంటి కేసే 2012 నుంచి పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.కోర్టును తప్పుదోవబట్టించే విధంగా ఐటి కమిషనర్ వ్యవహరించారని కోర్టు తప్పుబట్టింది.