బిజినెస్

క్యాపిటల్ మార్కెట్లలోకి విదేశీ నిధుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: విదేశీ మదుపరులు ఆగస్టు నెలలో భారత క్యాపిటల్ మార్కెట్లలో నికరంగా రూ. 5,100 కోట్లకు పైగా నిధులను పెట్టుబడులుగా పెట్టారు. వీటిలో రూ. 1,775 కోట్ల నిధులను ఈక్విటీ మార్కెట్లలో, రూ. 3,414 కోట్ల నిధులను డెబిట్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారు. దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల నిధులు తరలిరావడం ఇది వరుసగా రెండో నెల. దేశీయ స్థూలార్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు ప్రోత్సాహకరమయిన లాభాలను ఆర్జించడం, మిడ్, స్మాల్-క్యాప్ కంపెనీల షేర్ల ధరలు దిద్దుబాటుకు గురికావడం వల్ల భారత క్యాపిటల్ మార్కెట్లు విదేశీ మదుపరులను ఆకట్టుకుంటున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) జూలై నెలలో భారత క్యాపిటల్ మార్కెట్లలో నికరంగా రూ. 2,300 కోట్ల నిధులను పెట్టుబడులుగా పెట్టారు. ఆగస్టు నెలలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు జూలై నెలతో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలంలో ఎఫ్‌పీఐలు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 61,000 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు.