బిజినెస్

స్థూలార్థిక గణాంకాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, తాజా స్థూలార్థిక గణాంకాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో కదలికలు, ముడి చమురు ధరలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. 3మాన్యుఫాక్చరింగ్, సేవల పీఎంఐ గణాంకాల విడుదలతో రానున్న వారం మొదలు కానుంది2 అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. వాహనాల నెలవారీ విక్రయాల గణాంకాలు వెలువడుతున్నందున వాటి షేర్లపై మదుపరులు దృష్టి కేంద్రీకరించనున్నారు. రూపాయి విలువ పతనం, ముడి చమురు ధరల పెరుగుదల కొనసాగితే, అది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూలంగా పనిచేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అధిక స్థాయిల వద్ద కొనసాగుతుండటం వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం 26 పైసలు పడిపోయి, చరిత్రలో మొదటిసారి అత్యంత కనిష్ట స్థాయి 71 వద్ద ముగిసింది. 3దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల లాభాల స్వీకరణ కొనసాగుతుందని అంచనా. రూపాయి మారకం విలువ తగ్గుతున్నందున ఐటీ షేర్ల ధరలు నిస్సందేహంగా పెరుగుతున్నాయి. అయితే, స్వల్పకాలిక సమయం నుంచి మధ్యకాలిక సమయం వరకు మితిమీరిన కొనుగోళ్ల కారణంగా వాటి విలువ వాస్తవ విలువకన్నా బాగా పెరిగి పోయినందున త్వరలోనే వాటి ధరలు దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉంది2 అని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమీత్ మోదీ పేర్కొన్నారు. అయితే, వాహన అనుబంధ, వస్త్ర పరిశ్రమల వంటి ఎగుమతి చేసే పరిశ్రమల షేర్ల ధరలు మరింత పెరగడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసిక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు శుక్రవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడ్డాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ రెండు సంవత్సరాల గరిష్ఠ స్థాయి 8.2 శాతం వృద్ధి రేటుతో పెరిగింది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్), వ్యవసాయ రంగాల పనితీరు బాగుండటం వల్ల ఈ వృద్ధి రేటు సాధ్యమయింది. ప్రభుత్వం శుక్రవారం వెల్లడించిన జీడీపీ గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకొని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది. 3ఈక్విటీ, డెబిట్ మార్కెట్లకు మంచి రోజులు ఉన్నాయనే సంకేతాలను పటిష్టమయిన జీడీపీ గణాంకాలు వెల్లడించాయి2 అని ఆనంద్ రాథి ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఎకనమిస్ట్ సుజన్ హజ్రా పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 393.27 పాయింట్లు (1.02 శాతం) పుంజుకొని, 38,645.07 పాయింట్ల వద్ద ముగిసింది.