బిజినెస్

బంగారం కొన్న ఆర్‌బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 3: గత ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది. గత తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ బంగార నిల్వలను పెంచుకోవడం ఇదే మొదటిసారి. 2018 జూన్ 30వ తేదీనాటికి మొత్తం 566.23 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టు ఆర్‌బీఐ ఆ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది జూన్ 30వ తేదీ నాటికి ఈ మొత్తం 557.77 టన్నులని వివరించింది. 2009 నవంబర్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి 200 టన్నుల పసిడిని కొనుగోలు చేసిన ఆర్‌బీఐ ఆతర్వాత వివిధ కారణాల నేపథ్యంలో ఆ దిశగా ముందుకు సాగలేదు. చాలాకాలం తర్వాత తిరిగి బంగారు నిల్వలను పెంచుకోవడం శుభసూచకమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.