బిజినెస్

బలపడని రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 3: డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కొనసాగుతునే ఉంది. సోమవారం ఉదయం సుమారు పది పైసల మేర బలపడినట్టు కనిపించినప్పటికీ, ఆతర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. డాలర్ విలువ రికార్డు స్థాయిలో 71.10 రూపాయల వద్ద ముగిసింది. ఆగస్టు 31వ తేదీన 71 రూపాయలకు చేరిన రూపాయి విలువ, సోమవారం మరో పది పైసలు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. వృద్ధిరేటులో భారత్ దూసుకెళుతున్నదని ఒకవైపు కేంద్రం ప్రకటిస్తుంటే, మరోవైపు రూపాయి పతనం ప్రతికూల సంకేతాలిస్తున్నది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర పెరగడం, అమెరికా-చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందోనన్న భయం, అర్జెంటీనా, టర్కీ వంటి దేశాల్లో పెరుగుతున్న అంటు వ్యాధులు వంటి ఎన్నో అంశాలు ఫోరెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను శాసించాయి. ఫలితంగా రూపాయి మార్కెట్‌లో పతనం అనివార్యమైంది. భారత్‌లోనేగాక, అంతర్జాతీయ మార్కెట్‌లో వివిధ దేశాల ద్రవ్య మారకపు విలువలో పతనం స్పష్టంగా కనిపించింది.
డాలర్‌కు రూపాయి మారకపు విలువ 2014 మే 30న అత్యుత్తమంగా 58.71గా నమోదైంది. ఆతర్వాత ఎన్నడూ ఆ స్థాయిలో రూపాయి బలపడలేదు. 2015 జనవరి 30న 61.86 రూపాయలు, 2016 జనవరి 29న 67.78 రూపాయలు, 2017 జనవరి 31న 67.87, ఈ ఏడాది జనవరి 31న 63.58 రూపాయలుగా ఉన్న మారకపు విలువ 60 రూపాయలకు మాత్రం తగ్గలేదు. గత నెలలో దారుణంగా క్షీణిస్తూ వచ్చింది. మాసాంతానికి 71 రూపాయలకు చేరింది. ఈనెల ఆరంభంలోనే పతనం రికార్డు స్థాయికి చేరడంతో, రాబోయే రోజుల్లో పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఆర్థిక నిపుణులను వేధిస్తున్నది.
ఎఫ్‌బీఐఎల్‌లో..
డాలర్‌కు రూపాయి మారకపు విలువను ఫైనాన్షియల్ బెంచ్‌మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌బీఐఎల్) 70.7695 రూపాయలుగా ఖరారు చేసింది. యూరో విలువను 82.1445 రూపాయలుగా ప్రకటించింది.
ఎగుమతులు పెరగవు..
రూపాయి విలువ పతనమైన ప్రతిసారీ ఎగుమతులు పెరుగుతాయన్న వాదన సరికాదని ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) వ్యాఖ్యానించింది. రూపాయి మారకపు విలువ ప్రభావం ఎగుమతుల్లో కొంత వరకూ మాత్రమే ఉంటుందని ఈఈపీసీ చైర్మన్ రవి సెహగల్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్‌లో రూపాయి పతనం 5,19 శాతం ఉంటే, జూలై నాటికి 6.56 శాతానికి చేరిందని గుర్తుచేశారు. అయితే, జూన్, జూలై మాసాల్లో జరిగిన ఎగుమతుల్లో పెద్దగా తేడా కనిపించలేదని అన్నారు. రూపాయి మారకపు విలువ తగ్గినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.