బిజినెస్

లాభాల బాటలో హెచ్‌ఎస్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డు సుమారు 40 సంవత్సరాల తరువాత వరుసగా మూడేళ్లు లాభాలను ఆర్జించిందని షిప్‌యార్డు సీఎండీ రియర్ అడ్మిరల్ ఎల్.వీ.శరత్‌బాబు తెలియచేశారు. మంగళవారం షిప్‌యార్డులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి 69.80 కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రోఫిట్స్ సాధించామని చెప్పారు. గత ఏడాదికన్నా ఇది 86 శాతం అధికమని ఆయన తెలియచేశారు. అదేవిధంగా 20.99 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించామని చెప్పారు. వాస్తవానికి సుమారు 72 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించామని, ఎస్సార్ ఆయిల్ కంపెనీకి కోర్టు సూచించిన విధంగా 51.35 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. మొత్తంమీద 2017-18 ఆర్థిక సంవత్సరంలో షిప్‌యార్డు మొత్తం టర్నోవర్ 644.78 కోట్ల రూపాయలని చెప్పారు. షిప్‌యార్డు స్వదేశీపరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని శరత్ బాబు చెప్పారు. వరుసగా మూడు సంవత్సరాలు షిప్‌యార్డు లాభాలను ఆర్జిస్తే, మినీరత్న హోదా లభిస్తుందని చెప్పారు.
2020 నాటికి హిందుస్థాన్ షిప్‌యార్డుకు మినీరత్న హోదా లభిస్తుందని ఆయన తెలియచేశారు.షిప్‌యార్డులో వీసీ 11184 ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ సంతృప్తికరంగా కొనసాగుతోందని అన్నారు. ఈ ఏడాది మేలో ఐదు ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్స్‌ను సీ ట్రయల్స్ పూర్తి చేసి, ఆయా సంస్థలకు అప్పగించామని చెప్పారు. అదేవిధంగా 10 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు టగ్స్ నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. ఐఎన్‌ఎస్ కేశరి, ఐఎన్‌ఎస్ మగర్, అలాగే రష్యన్ సబ్‌మెరైన్ సింధువీర్ రీఫిట్ విజయవంతంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు. హుండయ్ కంపెనీ కొలాబరేషన్‌తో షిప్ డిజైన్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని సీఎండీ వెల్లడించారు.