బిజినెస్

ఆగని రూపాయి పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం మరో 37 పైసలు పడిపోయి, సరికొత్త కనిష్ట స్థాయి 71.58 వద్ద ముగిసింది. ఇక్కడి ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్) మార్కెట్‌లో పౌండ్ స్టెర్లింగ్‌తో పోలిస్తే కూడా రూపాయి మారకం విలువ తగ్గిపోయింది. పౌండ్ స్టెర్లింగ్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 91.77 వద్ద ముగిసింది.
దానికదే పెరుగుతుంది: ప్రభుత్వం
రూపాయి మారకం విలువ పడిపోతుండటానికి దేశీయ కారణాలేమీ లేవని, అందువల్ల రూపాయి విలువ దానికదే పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం సరికొత్త కనిష్ట స్థాయి 71.58కి పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.
రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతుల వ్యయం పెరిగి, దేశంలో వాటి ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. ‘ప్రాథమికంగా వాణిజ్య యుద్ధం సంభవిస్తుందేమోననే భయాందోళనలు, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల రూపాయి మారకం విలువ పడిపోతోంది. ఈ రెండు అంశాలపై భారత ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. అందువల్ల ఈ విషయంలో మనం చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ‘రూపాయి విలువ పడిపోవడానికి దేశీయ కారణాలేమీ లేనందున తిరిగి దానికదే కోలుకొని, నిలదొక్కుకుంటుంది’ అని ఆయన అన్నారు. రూపాయి విలువ పతనం వల్ల చమురు దిగుమతులపై ప్రభుత్వం ఎక్కువ వ్యయం చేయవలసి వస్తోంది. భారత్ తన చమురు అవసరాలను తీర్చుకోవడానికి 81 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది.