బిజినెస్

మరింత బలహీనపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు మరింత బలహీనపడ్డాయి. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, ప్రపంచ వాణిజ్య వివాదాలు వంటి అంశాలు దేశీయ మార్కెట్లను దెబ్బతీశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా అయిదో సెషన్ మంగళవారం కూడా పడిపోయింది. ఈ సూచీ వరుసగా ఇన్ని సెషన్ల పాటు దిగజారడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి. 155 పాయింట్లు పడిపోయిన ఈ సూచీ రెండు వారాల కనిష్ట స్థాయి అయిన 38,157.92 పాయింట్ల వద్ద ముగిసింది. విస్తృత స్థాయిలో ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరేబుల్స్, ఫైనాన్సియల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడం మార్కెట్ కీలక సూచీలను దెబ్బతీసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా వరుసగా రెండో సెషన్ మంగళవారం 62 పాయింట్లు (0.54 శాతం) పడిపోయి, 11,520.30 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 11,496.85- 11,602.55 పాయింట్ల మధ్య కదలాడింది. విదేశీ పెట్టుబడులు గణనీయ మొత్తంలో తరలిపోతుండటం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా కరెంటు ఖాతా లోటు విస్తృతం అవుతుండటం, దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతుండటం వంటి అంశాల పట్ల ఆందోళనగా ఉన్న మదుపరులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం ఇంట్రా-డేలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి 71.57 మార్కుకు పడిపోవడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలయిన అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లలో కన్స్యూమర్ డ్యూరేబుల్స్, పీఎస్‌యూలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ, టెలికం, యుటిలిటీస్, పవర్, లోహ, వాహన, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, చమురు- సహజ వాయువు, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెనె్సక్స్ ఉదయం సెషన్‌లో 206.04 పాయింట్లు పెరిగి, 38,518.56 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత విస్తృత స్థాయిలో అమ్మకాలు సాగడంతో 38,098.60 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 154.60 పాయింట్ల (0.40 శాతం) దిగువన 38,157.92 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు సెషన్లలో కలిసి 584.11 పాయింట్లు పడిపోయింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను సవరించకపోతే, వాటి ప్రభావం తక్షణమే ఉంటుందని, స్వల్ప కాలంలోనే దేశీయ మార్కెట్లలోని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్ల (ఎఫ్‌పీఐల) పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లు తరలిపోతాయని అసెట్ మేనేజ్‌మెంట్ రౌండ్‌టేబుల్ ఆఫ్ ఇండియా (ఏఎంఆర్‌ఐ) అనే ఇనె్వస్టర్ లాబీ గ్రూప్ సోమవారం ప్రకటించిన తరువాత గణనీయ మొత్తంలో విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయాయి. ఇది కూడా దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇదిలా ఉండగా, సోమవారం నాటి లావాదేవీలలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 21.13 కోట్ల, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 542.12 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో మంగళవారం ఆసియన్ పెయింట్స్ అత్యధికంగా 3.49 శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ 3.20 శాతం నష్టంతో రెండో స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో అదాని పోర్ట్స్, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, వేదాంత మొదలగునవి ఉన్నాయి.