బిజినెస్

సరికొత్త కనిష్ఠ స్థాయికి రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: రూపాయి విలువ పతనం వరుసగా ఆరో రోజు బుధవారం కూడా కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తాజాగా 17 పైసలు దిగజారి, మరో రికార్డు కనిష్ట స్థాయి 71.75 వద్ద ముగిసింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కరెన్సీలలో కొనసాగుతున్న బలహీన ధోరణి రూపాయిని దెబ్బతీశాయి. బుధవారం ఇంట్రా-డేలో భారత కరెన్సీ రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయి 71.97కు పతనమయింది. అయితే, తరువాత కొంత ఊపిరి తీసుకొని, లావాదేవీలు ముగిసే సమయానికి స్వల్పంగా పుంజుకుంది. గత ఆరు సెషన్లలో కలిసి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 165 పైసలు పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం రంగంలోకి దిగి పడిపోతున్న రూపాయి మారకం విలువను నియంత్రించడానికి చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా రూపాయి మరింత పతనం కాకుండా నిలదొక్కుకోవడంతో పాటు డాలర్‌తో పోలిస్తే 71.97 స్థాయి నుంచి కొంత పుంజుకుంది.