బిజినెస్

దెబ్బ తీసిన కరెన్సీ ఒడిదుడుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ బుధవారం మరింత బలహీనపడ్డాయి. రూపాయి విలువ మరింత పడిపోవడంతో పాటు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కరెన్సీ మార్కెట్లు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల కారణంగా స్టాక్ మార్కెట్లలో మదుపరులు అమ్మకాలకు పూనుకున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 139.61 పాయింట్లు పడిపోయి, రెండు వారాల కనిష్ట స్థాయి 38,018.31 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 43.35 పాయింట్లు పడిపోయి, 11,476.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ఆరు సెషన్లలో కలిసి 878.32 పాయింట్లు పడిపోయింది. ఈ సూచీ వరుసగా ఆరు సెషన్ల పాటు దిగజారడం గత ఆరు నెలల్లో ఇదే మొదటిసారి. తాజాగా తలెత్తిన వాణిజ్య యుద్ధ భయాలతో పాటు టర్కీ, అర్జెంటీనా, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని స్థూలార్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎదురుదెబ్బల కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కూడా సూచీలు పడిపోయాయి. ఈ పరిణామాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దేశీయంగా చూస్తే బాండ్ల ఆదాయాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఇంట్రా-డేలో మరింత పడిపోయి, సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 71.96కు దిగజారింది. కొత్త బిజినెస్ ఆర్డర్లు తగ్గడం వల్ల దేశ సేవల రంగం కార్యకలాపాలు జూలైతో పోలిస్తే ఆగస్టు నెలలో తగ్గాయని ఒక నెలవారీ సర్వే వెల్లడించడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలహీనపరచింది. నిక్కెయి ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటి ఇండెక్స్ జూలైలో ఉన్న 54.2 నుంచి ఆగస్టులో 51.5కు పడిపోయింది.
బీఎస్‌ఈ సెనె్సక్స్ బుధవారం ఉదయం కాస్త అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, తరువాత మరింత ముందుకు సాగుతూ 38,250.61 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే కొంత సేపటికే వేగంగా పడిపోయి, 38,000 మార్కుకన్నా కిందికి దిగజారింది. ఇంట్రా-డేలో 37,774.42 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 139.61 పాయింట్ల (0.37 శాతం) దిగువన 38,018.31 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా బుధవారం ఇంట్రా-డేలో కీలకమయిన 11,400 మార్కుకన్నా కిందికి దిగజారి, 11,393.85 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 43.35 పాయింట్ల (0.38 శాతం) దిగువన 11,476.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) మంగళవారం నికరంగా రూ. 21.41 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 32.64 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో హెచ్‌యూఎల్ బుధవారం అత్యధికంగా 2.45 శాతం నష్టపోయింది. కోటక్ బ్యాంక్ 1.68 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో భారతి ఎయిర్‌టెల్, రిల్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ ఉన్నాయి. మరోవైపు, యెస్ బ్యాంక్ షేర్ విలువ 2.93 శాతం పెరిగింది. లాభపడిన ఇతర సంస్థల్లో వేదాంత, అదాని పోర్ట్స్, విప్రో, సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో ఉన్నాయి. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ టెలికం ఇండెక్స్ అత్యధికంగా 2.23 శాతం పడిపోయింది.