బిజినెస్

వాణిజ్య బంధం బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: అమెరికా, భారత్ ద్వైపాక్షిక వాణిజ్య బలం మరింత బలపడాలని, ఇది 500 నుంచి 600 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన యూఎస్-ఇండియా వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడుతూ అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య సహకారాన్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. భారత్ కూడా ఈ దిశగా కృషి చేస్తున్నదని అన్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపార లావాదేవీల విలువ ప్రస్తుతం 125 బిలియన్ డాలర్లుగా ఉందని, ఇది 500 లేదా 600 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. వ్యూహాత్మక వాణిజ్య సహకారానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అమెరికాను మరోసారి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపును దృష్టిలో ఉంచుకుంటే, భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, లావాదేవీలు పెరగాలని అన్నారు. ఇటీవల కాలంలో భౌగోళిక ఆర్థికశాస్త్రం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని ప్రభు తెలిపారు. ఈ మార్పులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వాపారవేత్తలకు సూచించారు. అమెరికా, భారత్ ఒకటిగా ముందుకు వెళ్లడం ఇరు దేశాలకేగాక, యావత్ ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అమెరికాను ఆయన భారత్ వాణిజ్య మిత్ర దేశంగా అభివర్ణించారు.

చిత్రం..మంత్రి సురేష్ ప్రభు