బిజినెస్

ఏడో రోజూ పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: రూపాయి పతనం వరుసగా ఏడో రోజు గురువారం కూడా కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలో మొదటిసారి 72 స్థాయికన్నా దిగువకు దిగజారింది. ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.11 స్థాయికి పతనమయింది. ఇంట్రా-డేలో రూపాయి విలువ ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. అయితే, సెషన్ ముగిసే వరకు కొంత కోలుకుంది. అయినప్పటికీ బుధవారం ముగింపుతో పోలిస్తే 24 పైసల దిగువన 71.99 స్థాయి వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంత కనిష్ట స్థాయిలో ముగియడం కూడా ఇదే తొలిసారి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి మారకం విలువ పతనమయింది. గురువారం ఉదయం ఫోరెక్స్ మార్కెట్‌లో బుధవారం నాటి ముగింపు 71.75తో పోలిస్తే అధిక స్థాయి 71.62 వద్ద రూపాయి మారకం విలువ ప్రారంభమయింది. తరువాత ఉదయం సెషన్‌లో రూపాయి విస్తృత స్థాయిలో 71.62- 71.95 మధ్య కదలాడింది. ఉదయం 10.35 గంటలకు డాలర్‌తో పోలిస్తే 71.82 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం లావాదేవీలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రా-డే కనిష్ట స్థాయి 72.11కు పడిపోయింది.