బిజినెస్

ఎలక్ట్రిక్ వాహనాలకు పర్మిట్ అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశంలో ఎలక్ట్రికల్ వాహనాలు (ఈవీ)లకు పర్మిట్ ప్రక్రియ అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఇంథనాలతో నడిచే వాహనాలకు కూడా ఇది వర్తిస్తుందని గురువారం ఎస్‌ఐఏఎం వార్షిక సదస్సులో మాట్లాడుతూ గడ్కరి తెలిపారు. కాలుష్య నివారణకు ఈవీలు ఎంతగానో తోడ్పడతాయని, కాబట్టి వాహనాల తయారీదారులంతా ఈ దిశగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. బ్యాటరీలతో నడిచే ఆటోలు, టాక్సీలు లేదా బస్సులతోపాటు ఇతరత్రా వాహనాలను పర్మిట్ నుంచి మినహాయిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్, బయోడీజిల్, సీఎన్‌జీ, మెథనాల్, బయోఫ్యుయల్ వంటి ప్రత్యామ్నాయ ఇంథనాలతో నడిచే వాహనాలను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నట్టు చెప్పారు. తమతమ వహనాల్లో కొంత శాతం ఈవీలు తప్పనిసరిగా ఉండాలని ప్రైవేటు రవాణా రంగంలో అగ్రగాములుగా ఉన్న ఉబర్, ఓలా సంస్థలను కేంద్రం ఇప్పటికే ఆదేశించిందని గడ్కరి వివరించారు. ఈవీలపై 12 శాతం జీఎస్‌టీని తప్పించామని, కాబట్టి, అదనంగా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. రాయితీలు ఇవ్వడం అనేది అత్యవసరం కాదని వ్యాఖ్యానించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈవీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే, పర్మిట్ అవసరాల నుంచి వాటిని తప్పించామన్నారు. ప్రత్యామ్నాయ ఇంథనాన్ని వాడితే, కనీసం 5,500 కోట్ల రూపాయల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను ఆదా చేసుకోవచ్చని, దిగుమతులు కూడా గణనీయంగా తగ్గుతాయని గడ్కరి అన్నారు.