బిజినెస్

ఐడీబీఐలో వాటా 15%కి మించకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 7: రుణభారంతో కుంగిపోతున్న ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడులను 15 శాతానకి మించకుండా చూడాలని జీవత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. ఇందుకుగాను కాలపరిమితిని త్వరలోనే వెళ్లడిస్తామని తెలిపింది. ప్రస్తుం ఎల్‌ఐసీకి ఐడీబీఐలో 7.98 శాతం వాటా ఉంది. అయితే, వాటాను 51 శాతానికి పెంచాలని ఎల్‌ఐసీ తీర్మానించింది. బ్యాంకులో 85.96 శాతం వాటాలున్న కేంద్రం ఈ ఏడాది జూన్‌లో ఎల్‌ఐసీకి వాటాలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఎల్‌ఐసీకి ఐడీబీఐలో పెట్టుబడుల పట్ల ఆసక్తిని చూపింది. కేంద్రం కూడా ఆమోద ముద్ర వేయడంతో, ఈ దిశగా వేగాన్ని పెంచింది. అయితే, భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఐడీబీఐలో మెజారిటీ వాటాలను తీసుకోవడంపై ఐఆర్‌డీఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యధికంగా 15 శాతం వాటాలు తీసుకోవచ్చని సూచించింది. ఐడీబీఐలో వాటాలు తీసుకోవడానికి ముందు ఎల్‌ఐసీ జరిపిన వ్యాపార లావాదేవీలను నిశితంగా పరిశీలించిన తర్వాత, 15 శాతానికి వాటాలను స్థిరీకరించడానికి కాల పరిమితిని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.