బిజినెస్

మండుతున్న పెట్రోధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశంలో ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో వీటి ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 50 పైసల వరకు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల తాజా ధరల పట్టీ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.99కి చేరుకుంది. లీటర్ పెట్రోల్ ధర ముంబయిలో రూ. 87.39కి, చెన్నైలో రూ. 83.13కు, కోల్‌కతాలో రూ. 82.88కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 72.07కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర ముంబయిలో రూ. 76.51కి, చెన్నైలో రూ. 76.17కు, కోల్‌కతాలో రూ. 74.92కు చేరుకుంది. సెప్టెంబర్ అయిదో తేదీ ఒక్క రోజు మినహా ఆగస్టు నెల మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు ప్రతి రోజు పెరుగుతూనే వస్తున్నాయి. రూపాయి విలువ పతనంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.