బిజినెస్

మరింత బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు శుక్రవారం బలపడ్డాయి. శుక్రవారం రూపాయి స్వల్పంగా బలపడిన నేపథ్యంలో వాహన షేర్లలో వచ్చిన ర్యాలీ కారణంగా మార్కెట్ కీలక సూచీలు పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 147.01 పాయింట్లు పుంజుకొని 38,389.82 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 52.20 పాయింట్లు పెరిగి 11,589.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయితే, వారం రీత్యా చూస్తే, దేశీయ మార్కెట్ల ఆరు వారాల లాభాలకు తెరపడింది. ఈ వారంలో సెనె్సక్స్ 255.25 పాయింట్లు (0.66 శాతం), నిఫ్టీ 91.40 పాయింట్లు (0.78 శాతం) పడిపోయాయి. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే ఆటోమొబైల్‌లకు పర్మిట్లు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వాహన కంపెనీల షేర్ల ధరలు శుక్రవారం బాగా పెరిగాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో అత్యధికంగా లాభపడ్డాయి. గురువారం నాటి ముగింపుతో పోలిస్తే శుక్రవారం ఇంట్రా-డేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు ఎగువన 71.70 వద్ద కొనసాగడం కూడా మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఇంట్రా-డేలో సరికొత్త కనిష్ట స్థాయి 72.11 స్థాయికి పడిపోయి, చివరకు 71.99 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా ఆరు సెషన్లలో కలిసి 880 పాయింట్లు పడిపోయిన బీఎస్‌ఈ సెనె్సక్స్ ధరలు పడిపోయిన విలువయిన షేర్లను మదుపరులు కొనుగోలు చేయడం ద్వారా గురువారం నుంచి తిరిగి పుంజుకుంది. శుక్రవారం అధిక స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ సెషన్ ముగింపు సమయం దగ్గర పడుతున్నకొద్దీ మరింత పైకి ఎగబాకుతూ 38,421.56 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 147.01 పాయింట్ల (0.38 శాతం) ఎగువన 38,389.82 పాయింట్ల వద్ద ముగిసింది. మధ్యలో ప్రతికూల జోన్‌లోకి వెళ్లిపోయిన ఈ సూచీ ఒక దశలో 38,067.22 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం ఇంట్రా-డేలో 11,600 మార్కును అధిగమించి 11,603 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 52.20 పాయింట్ల (0.45 శాతం) ఎగువన 11,589.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) గురువారం నికరంగా రూ. 611.98 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 455 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో హీరో మోటోకార్ప్ అత్యధికంగా 5.27 శాతం, బజాజ్ ఆటో 5.06 శాతం చొప్పున లాభపడ్డాయి. లాభపడిన ఇతర వాహన సంస్థల్లో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, అశోక్ లేల్యాండ్, టీవీఎస్ మోటర్ ఉన్నాయి. సెనె్సక్స్‌లోని లాభపడిన ఇతర సంస్థల్లో భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిల్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, వేదాంత, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 4.98 శాతం వరకు పెరిగింది. తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయిన సన్ ఫార్మా 1.84 శాతం నష్టపోయింది.