బిజినెస్

ఏడు రోజుల పతనానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా ఏడు రోజుల పాటు పతనమయిన రూపాయి మారకం విలువ శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకోవడంతో పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారంతో పోలిస్తే 26 పైసలు పెరిగి, 71.73 వద్ద ముగిసింది. వాణిజ్య భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ముడి చమురు ధరల కారణంగా శుక్రవారం ఉదయం లావాదేవీలలో కూడా డాలర్‌తో రూపాయి మారకం విలువ 72 మార్కుకన్నా దిగువకు దిగజారి, 72.04 వద్దకు చేరింది. దీంతో ఆర్‌బీఐ తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకొని రూపాయి మారకం విలువ మరింత పతనం కాకుండా చర్యలు తీసుకుంది. ఫలితంగా రూపాయి పతనం నిలిచిపోవడంతో పాటు రికార్డు కనిష్ట స్థాయి నుంచి సెషన్ ముగిసే సమయానికి స్వల్పంగా బలపడింది. ముడి చమురు ధరలు మరింత పెరగకుండా నిలకడగా ఉండటంతో పాటు తాను పెట్టిన గడువు ముగిసినప్పటికీ అమెరికా.. చైనా సరుకులపై 200 బిలియన్ డాలర్ల దిగుమతి సుంకాన్ని విధించకపోవడం కూడా రూపాయిపై ఒత్తిడిని తగ్గించింది. తొలి లావాదేవీలలో బ్రెంట్ ముడి చమురు ధర బారెల్‌కు 76.74 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పతన పథంలో సాగుతూ వచ్చిన రూపాయి గత ఏడు రోజుల్లో డాలర్‌తో తన మారకం విలువను 189 పైసలు నష్టపోయింది. ఫోరెక్స్ చరిత్రలో రూపాయి ఇంతటి దీనావస్థకు చేరడం ఇదే మొదటిసారి. ఇంటర్-బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్)లో గురువారం నాటి ముగింపు 71.99 పోలిస్తే శుక్రవారం ఉదయం అధిక స్థాయి 71.95 వద్ద ప్రారంభమయిన రూపాయి మారకం విలువ ఆ తరువాత పతనం కావడం మొదలయింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయించడం ప్రారంభించడంతో రూపాయి మారకం విలువ అధిక స్థాయి వద్ద ప్రారంభమయింది. అయితే, తరువాత లావాదేవీలలో చోటు చేసుకున్న తీవ్రమయిన ఊగిసలాట మధ్య రూపాయి మారకం విలువ మరోసారి 72 మార్కుకన్నా దిగజారి, కనిష్ట స్థాయి 72.04 వద్దకు దిగజారింది. అయితే, రిజర్వ్ బ్యాంక్ తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకోవడం వల్ల రూపాయి మారకం విలువ తిరిగి పుంజుకొని, స్వల్ప లాభంతో ముగిసింది.

స్వల్పంగా తగ్గిన సీఏడీ
ముంబయి, సెప్టెంబర్ 7: దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.4 శాతానికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ కరెంటు ఖాతా లోటు జీడీపీలో 2.5 శాతం ఉండింది. అయితే, విలువ ప్రకారం చూస్తే క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సీఏడీ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సీఏడీ 15 బిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుత 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.8 బిలియన్ డాలర్లకు పెరిగింది.