బిజినెస్

రేపు జాక్ మా పదవీ విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 8: చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా సోమవారం కంపెనీ పదవుల నుంచి రిటైర్ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ద న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ మా ఈ విషయం వెల్లడించారు. విద్యారంగంపై కేంద్రీకరించి సామాజిక సేవ చేసేందుకు సమయాన్ని కేటాయించడం కోసం కంపెనీ పదవుల నుంచి రిటైర్ కావాలని జాక్ మా భావిస్తున్నారు. 1999లో అలీబాబా కంపెనీని స్థాపించడానికి ముందు జాక్ మా ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశారు. అలీబాబా ఈ-కామర్స్ కంపెనీని బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీగా తీర్దిదిద్దడం ద్వారా జాక్ మా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారు. కంపెనీ విలువతో పాటు జాక్ మా సొంత సంపద బాగా పెరిగింది. అలీబాబా షేర్ శుక్రవారం నాటి ముగింపు ధర ఆధారంగా జాక్ మా ఆస్తుల విలువ 420.8 బిలియన్ డాలర్లు. సోమవారం జాక్ మా 54వ పుట్టిన రోజు. అందువల్ల అదే రోజున అలీబాబా కంపెనీ నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్టు ఆయన ద న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలీబాబా కంపెనీ నుంచి తాను రిటైర్ కావడం ఒక శకానికి ఆరంభమే తప్ప, ముగింపు కాదని జాక్ మా పేర్కొన్నారు. అలీబాబా కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పదవి నుంచి 2013లో జాక్ మా వైదొలిగారు. విద్యారంగానికి తన సమయాన్ని కేటాయించడానికే అలీబాబా కంపెనీ నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.