బిజినెస్

గీతాంజలి జెమ్స్‌కు ఎన్‌ఎస్‌ఈ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: జూన్ మాసంతో అంతమయ్యే ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను దాఖలు చేయని గీతాంజలి జెమ్స్ కంపెనీకి జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ) నోటీసులు జారీ చేసింది. మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి సంస్థ వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసిన విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని సుమారు 13,000 కోట్ల రూపాయల మేర మోసం చేసిన మెహుల్ దేశం నుంచి పారిపోయి, విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. కాగా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన గీతాంజలి జెమ్స్‌తోపాటు ఏబీజీ షిప్‌యార్డ్, క్వాలిటీ లిమిటెడ్, యూనిటెక్, ఆమ్‌టెక్ ఆటో, ఎలక్ట్రోస్టీల్స్, సువానా కార్పొరేషన్‌సహా మొత్తం 35 కంపెనీలకు ఎన్‌ఎస్‌ఈ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. ఈ కంపెనీలకు ఎన్‌ఎస్‌ఈ జరిమానా కూడా విధించింది.