బిజినెస్

జెనెసిస్‌లో రిలయన్స్ రీటైల్‌కు మరో 16.31 శాతం వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రెడీమేడ్ వస్త్ర మార్కెట్ దిగ్గజయం జెనెసిస్ కలర్స్ లిమిటెడ్ (జీసీఎల్)లో రిలయన్స్ రీటైల్ అదనంగా మరో 16.31 శాతం వాటాలను కొనుగోలు చేసింది. 34.80 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వాటాలను పొందినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) తెలిపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిల్‌లో రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) అనుబంధ సంస్థగా ఉంది. ఇంతకు ముందు 49.46 శాతం వాటాలను కొనుగోలు చేసిన ఆర్‌ఆర్‌వీఎల్ తాజాగా మరో 16.31 శాతం వాటాలను సొంతం చేసుకుంది. దీనితో ఈ కంపెనీకి జెనెసిస్‌లో మొత్తం వాటా 65.77 శాతానికి పెరిగింది. ఫ్యాషన్, వస్త్ర పరిశ్రమపై మరింత పట్టు సాధించేందుకే ఆర్‌ఆర్‌వీఎల్ తాజా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసింది.