బిజినెస్

బంగ్లాదేశ్‌కు ఎన్‌టీపీసీ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బంగ్లాదేశ్‌కు 300 మెగావాట్స్ విద్యుత్ సరఫరాను ఎన్‌టీపీసీ ఆదివారం అర్థరాత్రి ప్రారంభించింది. ఎన్‌టీపీసీ నిర్వాహణలోని విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వీవీఎన్) ఈ సరఫరా బాధ్యతలను తీసుకుంది. బంగ్లాదేశ్ విద్యుత్ అభివృద్ధి బోర్డు (బీపీడీబీ)తో ఈనెల ఆరోతేదీన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఎన్‌వీవీఎన్ కుదుర్చుకుందని ఎన్‌టీపీసీ ఒక ప్రకటనలో తెలిపింది. దాని ప్రకారం ఆదివారం అర్థరాత్రి 12 గంటలకు బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా మొదలైనట్టు ఎన్‌టీపీసీ ఆ ప్రకటనలో పేర్కొంది. దామోదర్ వాలీ కార్పొరేషన్ (డీవీసీ) నుంచి ఈ సరఫరా జరుగుతుందని వివరించింది. భారత్‌లోని బరంపురం నుంచి బంగ్లాదేశ్‌లోని భేరమారా వరకూ అదనంగా 500 మెగా వాట్స్ సామర్థ్యంతో హై వోల్టేజీ డైరెక్ట్ కరెంట్ (హెచ్‌వీడీసీ)ని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రయోగ దశలో ఉందని వివరించింది.
తాల్చర్ ప్లాంట్ విస్తరణ
ఒడిశాలోని తాల్చర్ ప్లాంట్‌ను మరో 9.7 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించాలని పాలక మండలి నిర్ణయించినట్టు ఎన్‌టీపీసీ తన ప్రకటనలో పేర్కొంది. దీని ద్వారా 1,320 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ 60 మెగావాట్స్ సామర్థ్యంగల నాలుగు, 110 మెగావాట్స్ సామర్థ్యంగల రెండు యూనిట్లు ఉన్నాయి.