బిజినెస్

దుబాయ్‌లో సీఎస్‌ఆర్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దుబాయ్‌లో అత్యంత అధునాతనమైన సైబర్ సెక్యూరిటీ రెస్పాన్స్ (సీఎస్‌ఆర్) సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు టాటా కమ్యునికేషన్స్ ప్రకటించింది. ఇరవై నాలుగు గంటలూ ఈ సీఎస్‌ఆర్ వ్యవస్థ పని చేస్తుందని తెలిపింది. మధ్య తూర్పు ప్రాంతంలో ఇటీవల సైబర్ నేరాలు పెరగడంతో, సీఎస్‌ఆర్ సేవలు అక్కడ ప్రాధాన్యతను సంతరించుకున్నట్టు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో టాటా కమ్యునికేషన్స్ వివరించింది. ఇంతకు ముందు చెన్నై, పుణే, సింగపూర్‌లో సీఎస్‌ఆర్ సెంటర్లను ప్రారంభించి, నిర్వహిస్తున్న ఈ సంస్థ తన నాలుగో ప్రాజెక్టుగా దుబాయ్‌లో సెంటర్‌ను నెలకొల్పింది. యూఏఈసహా గల్ఫ్ దేశాలకు సైబర్ భద్రతను కల్పించడమే లక్ష్యమని టాటా కమ్యునికేషన్స్ తన ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, ఈ కేంద్రాన్ని ప్రారంభించిన యూఏఈ కృత్రిమ మేధస్సు శాఖ సహాయ మంత్రి ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా సైబర్ భద్రత ఆవస్యకతను ఒక ప్రకటనలో వివరించారు. భారీ నష్టాలను నివారించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.