బిజినెస్

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. సోమవారం పెట్రోల్ లీటరు ధర 23 పైసలు, డీజిల్ 22 పైసలు పెరిగాయి. పెట్రో ధరల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు అత్యధికంగా 80.73 రూపాయలు కాగా, డీజిల్ 72.83 రూపాయల వరకు పెరిగింది. అయితే, మిగిలిన అన్ని మెట్రో ప్రాంతాలు, రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే ఢిల్లీ పన్నులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంధన వనరుల రేటు తక్కువే. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను అమాంతం పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సోమవారం దేశవ్యాప్తంగా ‘్భరత్ బంద్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం డాలర్ విలువ పెరగడంతో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. ఒకదశలో రూపాయి విలువ 94 పైసలు దిగజారి 72.67తో జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. ఆగస్టు మధ్య కాలంలో పెట్రోల్ ధర 3.65 రూపాయలు, డీజిల్ ధర 4.06 రూపాయలు పెరగడంతో డాలర్ విలువ అమాంతం రికార్డు స్థాయికి చేరింది.