బిజినెస్

సెజ్‌ల అభివృద్ధికి మరింత గడువు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: గురుగ్రామ్‌లో తమ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరికొంత గడువుకావాలని 13 సెజ్ డెవలపర్స్‌తోపాటు, యూనిట్స్, జీపీ రియల్టర్స్, జేబీఎఫ్ పెట్రోకెమికల్స్, అరబిందో ఫార్మా వంటి సంస్థలు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరాయి. ఆయా సంస్థల ప్రతిపాదనలపై ప్రత్యేక ఆర్థిక జోన్లు (సెజ్‌లు) ఈనెల 12న జరిగే బోర్డు ఆఫ్ అప్రూవల్‌లో ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. 12న ఈ సమావేశం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగనుంది. గురుగ్రామ్‌లో ఎలక్ట్రానిక్ హార్ట్‌వేర్, ఐటీ, ఐటీఈఎస్ సెజ్ ఏర్పాటుకు జీపీ రియల్టర్స్ కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సంస్థ ఏర్పాటు చేయనున్న సెజ్‌కు 2006 నవంబర్ 14న ప్రాథమిక అనుమతి లభించింది. అప్పటినుంచి ఈ సంస్థ చేసిన అభ్యర్థనపై 2017 నవంబర్ 13వరకు తొమ్మిదిసార్లు పొడిగింపునకు అనుమతిచ్చారు. మళ్లీ ఇదే సంస్థ 2019 నవంబర్ 13వరకు గడువు కావాలని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా మంగుళూరులో బహుళ ఉత్పత్తులు చేసే సెజ్ సంస్థ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ సైతం తమ సెజ్ ఏర్పాటుకు 2018 సెప్టెంబర్ 18వరకు గడువు కావాలని అనుమతి కోసం అభ్యర్థించింది. అయితే, ఈ అభ్యర్థనపై గడువు ఏడాదిపాటు ఉంటుంది. కానీ పూర్తిస్థాయిలో సెజ్ ఏర్పాటు చేసేందుకుగాను ఈ సంస్థకు మరో రెండేళ్లు, ఆ తర్వాత అవసరమైతే మరో ఏడాది పాటు కార్యకలాపాలు ప్రారంభించేందుకు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఏర్పాటు చేయనున్న ఏపీఐఐసీ ఎంపీ సెజ్ ఏర్పాటుకు వచ్చే ఏడాది జూలై వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. గోల్డెన్ టవర్ ఇనఫ్రాటెక్, కుమార్ బిల్డర్స్ టౌన్‌షిప్ వెంచర్స్, క్యూ-3 ఇన్ఫోటెక్, టెంపుల్ ప్యాకేజింగ్, బెంజో కెమ్ ఇండస్ట్రీస్, హెలియోస్ ఫొటో వోల్టాయిక్ తదితర సంస్థలు తమ సెజ్‌లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖను అభ్యర్థించాయి. ఆయా సంస్థలు ఏర్పాటు చేయబోయే సెజ్‌లకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాకాలతోపాటు పన్ను మినహాయింపు సౌకర్యం, సింగిల్ విండో విధానం ద్వారా చేయూతనిస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సెజ్‌ల ద్వారా 15 శాతం అంటే దాదాపు 5.52 లక్షల కోట్ల రూపాయల విలువగల ఎగుమతులు జరిగాయి.