బిజినెస్

రెండోరోజూ మార్కెట్లు ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భారీగా దెబ్బతిన్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోందనే ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఎఫ్‌ఎంసీజీ, లోహ, వాహన, ఫైనాన్సియల్ స్టాక్‌లు తీవ్ర స్థాయిలో అమ్మకాల ఒత్తిడికి లోనయి, మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 509 పాయింట్లు పడిపోయి, 37,413.13 పాయింట్ల వద్ద ముగిసింది. భారీగా దిగజారిన ఈ సూచీ నెల రోజుల కనిష్ట స్థాయికి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 150 పాయింట్లు పడిపోయి, మానసికంగా కీలకమయిన 11,300 మార్కుకన్నా దిగువకు దిగజారింది. మంగళవారం మధ్యాహ్నం లావాదేవీలలో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయి 72.73కు పతనం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. సెనె్సక్స్ వరుసగా రెండో రోజు మంగళవారం ఒక శాతానికి పైగా పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం అధిక స్థాయిల వద్దనే ప్రారంభమయ్యాయి. కీలక సూచీలు ముందుకు సాగాయి. అయితే, ఆసియన్ ట్రేడ్‌లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడంతో దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా ప్రతికూల జోన్‌లోకి వెళ్లిపోయాయి. ఆరంభంలో ఆర్జించిన లాభాలు ఆవిరయ్యాయి. మళ్లీ కోలుకోలేక పోయాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే భారీగా 509.04 పాయింట్ల (1.34 శాతం) దిగువన 37,413.13 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు రెండో తేదీ తరువాత సెనె్సక్స్ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఆగస్టు 2న ఈ సూచీ 37,165.16 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం ఈ సూచీ 467.65 పాయింట్లు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 150.60 పాయింట్లు (1.32 శాతం) పడిపోయి, 11,287.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ గరిష్ఠ స్థాయి 11,479.40 పాయింట్లు, కనిష్ట స్థాయి 11,274 పాయింట్ల మధ్య కదలాడింది. ముడి చమురు ధరల పెరుగుదల, రికార్డు కనిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ పతనం, వాణిజ్య లోటు పెరగడం, బలహీన ప్రపంచ సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బ తినడానికి ప్రధాన కారణాలు. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్ల (ఎఫ్‌పీఐల) వైఖరిలో మార్పు వచ్చిన సూచనలు కనిపించడం లేదు. వారు సోమవారం నికరంగా రూ. 841.68 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) కూడా రూ. 289.66 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టాటా స్టీల్ మంగళవారం అత్యధికంగా 3.46 శాతం నష్టపోయింది. పవర్‌గ్రిడ్ 3.21 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో పాటు ఇప్పటికే ధరలు ఎక్కువగా పెరిగి ఉన్న ఎఫ్‌ఎంసీజీ షేర్ల ధరలు మంగళవారం పడిపోయాయి. ఐటీసీ షేర్ విలువ 2.92 శాతం, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్ విలువ 1.19 శాతం తగ్గింది. దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు వరుసగా రెండో నెల ఆగస్టులో 2.46 శాతం తగ్గిపోవడంతో వాహన కంపెనీల షేర్ల విలువ కూడా పడిపోయింది. వీటి షేర్ల ధర 4.2 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఆసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి.