బిజినెస్

జన్‌ధన్ ఖాతాల లెక్క తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: డిమోనిటైజేషన్ సమయంలో దేశ వ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన డిపాజిట్ల వివరాలు వెల్లడించాలని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. 2014 ఆగస్టులో ప్రధాన్ మంత్రి జన్‌ధన్ యోజన కింద కొత్త ఖాతాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సేవింగ్స్, డిపాజిట్ అకౌంట్లు, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్ సదుపాయలు ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే 2016 సెప్టెంబర్ 8 తరువాత జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు అమాంతంగా పెరిగిపోయాయి. ఎంత వరకూ ఎగబాకయంటే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 80,000 కోట్ల రూపాయలు జన్‌ధన్ ఖాతాల్లోకి చేరాయి. ఈ ఖాతాల్లో ఎంత మొత్తం ఉంది, ఎక్కడి నుంచి జమ అయ్యాయన్న సమాచారం కావాలని ఆర్‌టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ కోరారు. దీనికి ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. డిమోనిటైజేషన్ తరువాత జన్‌ధన్ ఖాతాల్లో ఎంత మొత్తం జమ అయిందీ వివరాలు వెల్లడించాలని సీఐసీ కమిషనర్ సుధీర్ భార్గవ ఆర్‌బీఐని ఆదేశించారు. 500, 1000 రూపాయల నోట్లను ప్రభుత్వం రద్దుచేయడాన్ని ఆసరా చేసుకుని పలువురు బ్యాంక్ అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
వచ్చే ఏడాది జాక్ రిటైర్‌మెంట్!
* ‘ఆలీబాబా’లో కలకలం * కొత్త బాస్ డానియెల్?
బీజింగ్, సెప్టెంబర్ 12: చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాస్ రిటైర్‌మెంట్ నిర్ణయం తీవ్ర కలకలం రేపింది. జాక్ నిష్క్రమణ ఎక్కడికి దారితీస్తుందోన్న ఆందోళన వ్యాపార, వాణిజ్య వర్గాల్లో కనిపించింది. ఆలీబాబా గ్రూపు ఈ-కామర్స్ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిందని చైనా ఆర్థిక నిపుణలు, ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఆలీబాబా గ్రూప్ సీఈఓ డానియెల్ జంగ్ కంపెనీ కాబోయే బాస్ అంటూ సోమవారం వార్తా కథనాలు వెలువడ్డాయి.

జాక్ మాస్ బాధ్యతలు డానియల్ చేపడతారని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ మార్పులుంటాయని పేర్కొన్నారు. జాక్ పదవీ విరమణ చేసినా గ్రూప్ డైరెక్టర్‌గా కొనసాగుతారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా జాక్ మాస్ రిటైర్‌మెంట్ వార్త చైనా వాణిజ్య వర్గాల్లో హాట్‌టాపిక్ అయింది. సీనావెబో సైట్ అంతటా జాక్ రిటైర్‌మెంట్ వార్తే హల్‌చల్ చేసింది. అనేక మంది ప్రముఖలు 54ఏళ్ల జాక్‌మాస్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన మార్గదర్శకంలో గ్రూపుఅంతర్జాతీయ ఖ్యాతిని పొందడంతో పాటు ఈ- కామర్స్‌లోనే రారాజుగా వెలుగొందిందని ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ స్పష్టం చేసింది. అయితే కంపెనీ స్టాక్ మార్కెట్‌పై జాక్ ప్రభావం కచ్చితంగా ఉంటుందని, ఒక విధంగా ఇది దుర్వార్తేనని కామర్స్ నిపుణుడు లీ ఛెంగ్‌డాంగ్ వ్యాఖ్యానించారు. కంపెనీ ఖండాంతరాలకు విస్తరించడం వెనక ఆయన పాత్ర ఎంతో ఉందని, ఫైనాన్స్, లాజిస్టిక్, క్లౌడ్ సర్వీసులో ఆలీబాబా విశ్వవాప్తమైందని మరో ఇండీపెండెంట్ ఐటీ నిపుణుడు ఛెంగ్ ఛున్‌హూ అన్నారు.