బిజినెస్

ప్రభుత్వ జోక్యంతో కోలుకున్న రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: రూపాయి మారకం విలువ బుధవారం బాగా పతనమయినప్పటికీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన భరోసాతో తిరిగి పుంజుకుంది. అధిక ముడి చమురు ధరలకు అనుగుణంగా బుధవారం ఉదయం లావాదేవీలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 72.91కి పతనమయింది. అధిక ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశ వాణిజ్య లోటు పెరుగుతుందనే ఆందోళనలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. అయితే రూపాయి మారకం విలువ అనుచిత స్థాయికి పతనం కాకుండా జోక్యం చేసుకుంటానని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో రూపాయి కోలుకోవడం ప్రారంభించింది. ఒక దశలో 105 పైసలు పుంజుకొని, ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 71.86కు ఎగబాకింది. అయితే, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే డాలర్‌తో రూపాయి మారకం విలువ 51 పైసల ఎగువన 72.18 వద్ద ముగిసింది. ‘ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూపాయి విలువ అనుచిత స్థాయికి పతనం కాకుండా అవసరమయిన అన్ని చర్యలు తీసుకుంటాయి. ఈరోజు చోటు చేసుకున్న కరెక్షన్ వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నట్టు కనపడుతోంది’ అని అంతకు ముందు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. దేశ వాణిజ్య లోటు అయిదేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 18.02 బిలియన్ డాలర్ల నుంచి ఆగస్టు నెలలో 17.4 బిలియన్ డాలర్లకు తగ్గిందని గార్గ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతంలో దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తారని వార్తలు వచ్చిన తరుణంలోనే గార్గ్ రూపాయి విలువ పతనంపై ట్విట్టర్‌లో స్పందించారు.