బిజినెస్

15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 27: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఏ పరిశ్రమ స్థాపనకైనా పారిశ్రామికవేత్తలు సహా ఔత్సాహికులు ముందుకువచ్చిన పక్షంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది.
ఆయా ప్రభుత్వ శాఖల చుట్టూ తిరిగే పనిలేకుండా ఏక గవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధత వ్యక్తం చేయడంతో పారిశ్రామికవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు తూర్పు తీర ప్రాంతంలో కొత్తగా పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు స్థానిక స్థితిగతులపై తగిన అవగాహన కలిగించేందుకు ఈ నెల 29న జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సదస్సుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కెపి సుధాకర్ చెప్పారు. విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) ముందుకువచ్చినట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కాకినాడ కేంద్రంగా లాజిస్టిక్ యూనివర్సిటీ కార్యకలాపాలను ఈ ఏడాది నుండే ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరిగితే కోస్తాతీరంలో కాకినాడ-విశాఖ మధ్య అభివృద్ధి అనూహ్యంగా సాధ్యమవుతుందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామికంగా కాకినాడ తీరానికి అభివృద్ధి అవకాశాలు ఎక్కువున్నట్టు చెబుతున్నారు. కాకినాడ తీరంలో ప్రస్తుతం రెండు పోర్టులు ఉండగా, త్వరలో జిఎంఆర్ ఆధ్వర్యంలో మూడవ ఓడరేవును నిర్మించనున్నారు. తూర్పు తీరంలో ఎగుమతి, దిగుమతులకు కాకినాడ పోర్టు ప్రధాన భూమిక పోషించనున్న నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాకినాడ తీరంలో సుమారు 50 వేల కోట్ల విదేశీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు బహుళ జాతి సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్త అయినా పరిశ్రమ ఏర్పాటుకు ముందుకువచ్చిన పక్షంలో ఏక గవాక్ష విధానంలో 15 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పారిశ్రామికవేత్తలు కోరిన వెంటనే వౌలిక సదుపాయాలతో కూడిన భూమిని ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పరిశ్రమల కోసం ప్రత్యేక ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటుచేసే పనిలో రెవెన్యూ అధికారులున్నారు. ఇటీవల జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి మండలాలు సహా మెట్ట ప్రాంతాలలో సైతం పరిశ్రమలకు అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఐఐసి) ఆధీనంలో ఉన్న భూములను కూడా ఆయా పారిశ్రామిక సంస్థలకు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకువస్తోంది.