బిజినెస్

ఆగని పెట్రోమంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగడమే లేదు. శనివారం మరోసారి పెరిగిన వీటి ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం వీటి ధరలను పెంచడంతో వివిధ నగరాల్లో వీటి ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ చౌకగా లభించే ఢిల్లీలోనే లీటర్ పెట్రోల్ ధర రూ. 81.63కు చేరుకుంది. లీటర్ పెట్రోల్ ధర ముంబయిలో రూ. 89.01, చెన్నైలో రూ. 84.85కు, కోల్‌కతాలో రూ. 83.49కి పెరిగింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 73.54కు, ముంబయిలో రూ. 78.07కు, చెన్నైలో రూ. 77.74కు, కోల్‌కతాలో రూ. 75.39కి పెరిగింది. స్థానిక పన్నులు, రవాణా వ్యయం కారణంగా వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలు, చాలా రాష్ట్రాల రాజధాని నగరాలతో పోలిస్తే ఢిల్లీలో స్థానిక పన్నులు తక్కువ. అందువల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ముంబయిలో స్థానిక పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ చమరు మార్కెటింగ్ సంస్థలు గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.