బిజినెస్

రెండోవారమూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తొలి రెండు సెషన్లలో అమ్మకాల ఒత్తిడి
* రూపాయి నిలదొక్కుకోవడంతో చివరి రెండు రోజుల్లో పుంజుకున్న సూచీలు
* ఈ వారం మార్కెట్ సరళిపై సమీక్ష
ముంబయి, సెప్టెంబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం నష్టపోయాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో మార్కెట్ కీలక సూచీలు దిగజారాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 299.18 పాయింట్లు పడిపోయి, 38,090.64 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 73.90 పాయింట్లు దిగజారి, 11,515.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. నాలుగు రోజులు మాత్రమే మార్కెట్లు పనిచేసిన ఈ వారంలో లావాదేవీలు అనిశ్చితిలో కొనసాగాయి. రూపాయి విలువ పతనం సహా ఇతర ప్రతికూల అంశాల వల్ల మొదటి రెండు రోజులు బాగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జోక్యంతో రూపాయి నిలదొక్కుకోవడం వల్ల చివరి రెండు రోజులు మాత్రం పుంజుకున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలు పెరగడం, చైనా దిగుమతులపై అధిక సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు నెలకొనడం వంటి పరిణామాలతో ఈ వారంలో దేశీయ మార్కెట్లు తొలి రెండు రోజులు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ తిరిగి 37,000 మార్కు స్థాయికి దిగజారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో కీలక వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. పెరుగుతూ వచ్చిన ముడి చమురు ధరలు, డాలర్ బలపడటం వల్ల రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయికి పతనం కావడంతో పాటు దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరగడం వంటి కారణాల వల్ల దేశీయ మార్కెట్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారాంతంలో దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తారని బుధవారం వెలువడిన వార్తలతో పాటు రూపాయికి ఊతమివ్వడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అధికారులు ఇచ్చిన భరోసాతో దేశీయ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. చివరి రెండు సెషన్లలో మార్కెట్ కీలక సూచీలు గణనీయంగా పుంజుకోవడం వల్ల ఈ వారంలో మార్కెట్‌కు నష్టాలు తగ్గాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీతో రికార్డు కనిష్ట స్థాయి నుంచి రూపాయి కోలుకోవడం వల్ల స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. ఆగస్టు నెలలో వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పది నెలల కనిష్ట స్థాయి 3.69 శాతానికి తగ్గడం, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా నాలుగు నెలల కనిష్ట స్థాయి 4.53 శాతానికి తగ్గడం వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఈ వారంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.84 వద్ద ముగిసింది. అంతకు ముందు బుధవారం రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయి 72.92కు పతనమయింది. చివరి రెండు సెషన్లలో విస్తృతంగా కొనుగోళ్లు జరగడం వల్ల బీఎస్‌ఈ సెనె్సక్స్ తిరిగి కీలకమయిన 38వేల మార్కుకు పైన ముగిసింది. గణేశ్ చతుర్థితిని పురస్కరించుకొని స్టాక్ మార్కెట్లు ఈ నెల 13న (గురువారం) పనిచేయలేదు. బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారం దిగువ స్థాయి 38,348.39 పాయింట్ల వద్ద ప్రారంభమయింది. గరిష్ఠ స్థాయి 38,354.52 పాయింట్లు, కనిష్ట స్థాయి 37,342 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 299.18 పాయింట్ల (0.78 శాతం) దిగువన 38,090.64 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ క్రితం వారంలో 255.25 పాయింట్లు (0.66 శాతం) దిగజారింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ వారంలో 11,570.25 పాయింట్ల దిగువ స్థాయి వద్ద ప్రారంభమయింది. గరిష్ఠ స్థాయి 11,573.00, కనిష్ట స్థాయి 11,250.20 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 73.90 పాయింట్ల (0.64 శాతం) దిగువన 11,515.20 పాయింట్ల వద్ద ముగిసింది. పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మాత్రమే ఈ వారంలో లాభపడ్డాయి. వాహన, ఐపీఓ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, చమురు- సహజ వాయువు, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి, పీఎస్‌యూలు, టెక్నాలజి షేర్లు నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు కూడా తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.