బిజినెస్

సరైన చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 16: క్షీణిస్తున్న రూపాయి విలువను కాపాడేందుకు కేంద్రం ప్రకటించిన చర్యల వల్ల ఉపయోగం ఏమీ లేదని మార్కెట్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. దీర్ఘకాలంలో వీటి వల్ల రుణ భారం పెరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నివేదికలో పేర్కొంది. వివిధ కంపెనీల ఆర్థిక పరిస్థితుల్లో రిస్క్ పెంచే విధంగా ఈ చర్యలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. పైగా విదేశీ పెట్టుబడుల రాక కూడా ఆశాజనకంగా ఉండే విధంగా, నిధుల ప్రవాహం పెంచే విధంగా ఈ చర్యలు ఏమీ లేవని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. విదేశీ మారక ద్రవ్యం నిధులను 8 నుంచి 10 బిలియన్ డాలర్ల మేర ఆదా చేయవచ్చని, విదేశీపెట్టుబడుల రాక వృద్ధి చెందుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కాగా గ్లోబల్ మార్కెట్‌లో సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు కేంద్రం చర్యలు పనిచేసి ఉండేవని నివేదిక తెలిపింది. విదేశీ బ్రోకరేజీ సంస్థ ప్రతినిధి నోముర మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులను పెంచే విధంగా చర్యలు ఉండాలన్నారు. దిగుమతులపై కోతలు విధించి, ఎగుమతులకు ప్రోత్సహం కలిగించేవిధంగా ఈ చర్యలు ఉండాలన్నారు. కాగా కేంద్రం రూపాయి మారకం విలువ మరింత పడిపోకుండా రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశం ఉంది.