బిజినెస్

రూ.90కి చేరువలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో వీటి ధరలు మరో సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలకు చేరాయి. తాజా ధరల నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.29కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ. 81.91కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.15కు, కోల్‌కతాలో రూ. 83.76కు చేరుకుంది. పెరిగిన తాజా ధరల నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధర కూడా సరికొత్త గరిష్ఠ స్థాయి కి ఎగబాకింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 73.72కు, ముంబయిలో రూ. 78.26కు, చెన్నయ్‌లో రూ. 77.94కు, కోల్‌కతాలో రూ. 75.57కు చేరుకుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం కూడా పెరిగాయి.
వెయ్య కోట్ల సేకరణే బీవోఐ లక్ష్యం
రియాల్టీ, ఎస్‌టీసీఐలో వాటాల విక్రయానికి వ్యూహం
ముంబయి, సెప్టెంబర్ 16: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెయ్యి కోట్ల నిధులను సేకరించేందుకు రియాల్టీ ఆస్తులను విక్రయించాలని యోచిస్తోంది. దీంతో పాటు ప్రాధాన్యత లేని ఆస్తులనూ అమ్మాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎస్‌టీసీఐ ఫైనాన్స్, సిడ్బీలో వాటాలను విక్రయించి రూ.800 కోట్లను సేకరించాలని అంచనావేస్తోంది. మరికొన్ని చోట్ల రియాల్టీ ఆస్తులను విక్రయించేసి రూ.200 కోట్లను సేకరించనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఎస్‌టీసీఐ ఫైనాన్స్‌లో 29.96 శాతం వాటాలు ఉన్నాయి. సిడ్బీలో 2.84 శాతం వాటాలు ఉన్నాయి. ఎస్‌టీసీఐ ఫైనాన్స్‌లో వాటాలను విక్రయించేలా ప్రణాళికను ఖరారు చేసింది.