బిజినెస్

మళ్లీ పెరిగిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 17: గత వారాంతంలో కొద్దిగా తగ్గిన పసిడి ధర సోమవారం మళ్లీ పెరిగింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాన్ని అమెరికా మరింత పెంచనున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నీరసించాయి. దీనితో బంగారంపై మదుపరులు ఆసక్తి చూపారు. జ్యుయెలరీ తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమయ్యాయి. మొత్తం మీద జాతీయ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం 180 రూపాయల మేర పెరిగి, 31,420 రూపాయలకు చేరింది. వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. అంతర్జాతీయ పరిణామాలకుతోడు నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడడంతో, కిలో వెండి కూడా 180 రూపాయలు పెరిగి, 37,680 రూపాయల ధర పలికింది. శనివారం నాడు పది గ్రాముల బంగారం 37,500 రూపాయలుకాగా, కిలో వెండి ధర 31,420 రూపాయలు.