బిజినెస్

మోసాలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో జరుగుతున్న మోసాలపై నిఘా పెట్టడంతోపాటు, మార్కెట్‌లో కీలక పాత్రధారులు జవాబుదారీతనం వహించేలా చర్యలు తీసుకోవడం ప్రధాన అజెండాగా మంగళవారం సెబీ బోర్డు సమావేశం జరగనుంది. ఇన్‌ట్రా ట్రేడింగ్ వల్ల వాస్తవ మదుపరులు భారీగా నష్టపోవడం ఇటీవల కాలంలో పెరుతున్నది. కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, మార్కెట్ లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే ఆడిటర్లు, విలువను నిర్ధారించేవారు ఎవరికీ జవాబుదారీ తనం వహించాల్సిన అవసరం లేదు. దీనితో వారి ప్రకటనలు, విశే్లషణలు, అభిప్రాయాల ఆధారంగానే సెబీ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ, స్వప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మదుపరులు తప్పుతోవ పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సెబీ బోర్డు మంగళవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మార్కె ట్ వర్గాలు జవాబుదారీతో వ్యవహరించేలా నిబంధలను కఠినతరం చేసే అవకాశం ఉంది.
‘ఇన్‌సైడర్’పై దృష్టి
ఆర్థిక ప్రగతి, వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావాన్ని చూపే స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ది ప్రధాన భూమిక. చాలా సందర్భాల్లో దీని వల్ల స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. మదుపరులు కోలుకోలేని రీతిలో దెబ్బతింటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించిన సెబీ బోర్డు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై నిఘా పెంచే ప్రయత్నంలో ఉంది. అవాంఛనీయ లావాదేవీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యోచిస్తున్నది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను అదుపుచేసి, స్టార్ మార్కెట్‌లో షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లను వ్యవస్థీకరించడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసే దిశగా మంగళవారం నాటి సమావేశం సెమీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తున్నది.
రుణ పరిమితి పెంపు!
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రుణాలను 25 శాతం పెంచుకోవడానికి భారీ కార్పొరేట్ సంస్థలకు అనుమతిస్తూ, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ లా సెక్రెటరీ టీకే విశ్వనాథన్ అధ్యక్షతన సమావేశం కానున్న సెబీ బోర్డు తీర్మానాన్ని ఆమోదించనుందని సమాచారం. కార్పొరేట్ సంస్థల రుణ పరిమితిని పెంచడం వల్ల విస్తరణకు అవకాశం ఉంటుందని ఆర్థిక విశే్లషకుల అభిప్రాయం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్ట్‌మెంట్ (ఎఫ్‌పీఐ)కు ఏకీకృత దరఖాస్తు విధానాన్ని కూడా సెమీ బోర్డు ఆమోదించవచ్చని అంటున్నారు. ఏ రకంగా చూసినా, ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను నిర్ధారిస్తాయన్నది వాస్తవం.