బిజినెస్

విదేశీ విద్యకు పెరుగుతున్న చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడంతో, విదేశాలకు చేస్తున్న చెల్లింపులు కూడా క్రమంగా పెరుగుతునే ఉన్నాయి. ఈ ఏడాది జూలై మాసంలో 343.6 మిలియన్ డాలర్లను విదేశాలకు చెల్లింపులు జరిగాయి. ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించిన నివేదికను అనుసరించి, 2017 జూలైలో 179 మిలియన్ డాలర్లుగా ఉన్న విదేశాల్లో చదువుల కోసం చేసిన చెల్లింపులు ఏడాది కాలంలో దాదాపు రెట్టింపు అయ్యాయి. గత ఏడాది ఆగస్టులో 240.7, సెప్టెంబర్‌లో 278, అక్టోబర్‌లో 167.4, నవంబర్‌లో 136.3, డిసెంబర్‌లో 147 మిలియన్ డాలర్ల మొత్తాలు చెల్లించినట్టు ఎస్‌బీఐ పేర్కొంది. కాగా, ఈ ఏడాది జనవరిలో 231, ఫిబ్రవరిలో 139.7, మార్చిలో 134.1, ఏప్రిల్‌లో 115.7, మేలో 178, జూన్‌లో 257.2 మిలియన్ డాలర్లు చొప్పున వివిధ దేశాల్లో చెల్లింపులు జరిగాయి. జూలైలో ఇది 343.6 మిలియన్ డాలర్లుగా నమోదైంది.