బిజినెస్

విలీనం ప్రకటనతో నష్టపోయన బీవోబీ, విజయా బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: గత ఏడాది మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా పలు బ్యాంకులు విలీనం కావడంతో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన హోదాను కోల్పోనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లను విలీనం కానున్న నేపథ్యంలో, ఎస్‌బీఐ కంటే అతి పెద్ద బ్యాంక్ అవతరించనుంది. ఇలావుంటే, విలీనం ప్రకటన ప్రభావంతో బీవోబీ, విజయా బ్యాంక్‌లు నష్టాన్ని చవిచూశాయి. మంగళవారం స్టాక్ మార్కెట్‌లో బీవోబీ షేర్ ధర 16.03 శాతం పతనమై, 113.45 రూపాయలకు చేరింది. అదే విధంగా విజయా బ్యాంక్ షేర్ 5.69 శాతం తగ్గి, 56.40 రూపాయల వద్ద ముగిసింది. అయితే,
ఈ ప్రకటనతో దేనా బ్యాంక్ భారీగా లాభపడింది. ఈ బ్యాంక్ షేర్లు 19.75 శాతం పెరిగి, 19.10 రూపాయలకు చేరింది. కాగా, బీవోబీ మార్కెట్ విలువ 5,726.62 కోట్ల రూపాయలు తగ్గి, 30,013.38 కోట్ల రూపాయలకు పతనమైంది. అదే విధంగా విజయా బ్యాంక్ మార్కెట్ విలువలో 442.61 కోట్ల రూపాయల తగ్గుదల నమోదైంది. మంగళవారం సాయంత్రానికి ఈ బ్యాంక్ విలువ 7,355.39 కోట్ల రూపాయలుగా స్థిరపడింది.