బిజినెస్

మూడోరోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు బుధవారం కూడా నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ కోలుకున్నప్పటికీ, ప్రపంచ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 169 పాయింట్లు దిగజారి, రెండు నెలల కనిష్ట స్థాయి 37,121.22 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 44.55 పాయింట్లు పడిపోయి, 11,234.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ఇప్పటి వరకు మూడు రోజుల్లో కలిసి 970 పాయింట్లు పడిపోయింది. ప్రధానంగా రూపాయి బలహీనత, అధిక ముడి చమురు ధరలు, దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు ఎడతెరిపి లేకుండా తరలిపోతుండటం, అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వంటివి దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనపడటానికి కారణమయ్యాయి. ఇదిలా ఉండగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఇంట్రా-డేలో 49 పైసలు పెరిగి, 72.49 వద్దకు చేరింది. బుధవారం ఉదయం బీఎస్‌ఈ సెనె్సక్స్ సానుకూల ధోరణిలోనే ప్రారంభమయింది. రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ట స్థాయి నుంచి కోలుకోవడంతో దానికి అనుగుణంగా సెనె్సక్స్ ఇంట్రా-డేలో ఒక దశలో 37,530.63 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, మధ్యాహ్నం తరువాత జరిగిన లావాదేవీలలో ఈ సూచీ బలహీనపడిపోయి, క్రితం ముగింపుతో పోలిస్తే 169.45 పాయింట్ల (0.45 శాతం) దిగువన 37,121.22 పాయింట్ల వద్ద ముగిసింది. జూలై 26వ తేదీ తరువాత ఈ సూచీ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. జూలై 26న ఈ సూచీ 36,984.64 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా బుధవారం 44.55 పాయింట్లు (0.39 శాతం) పడిపోయి, 11,234.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో ఈ సూచీ గరిష్ఠ స్థాయి 11,332.05, కనిష్ట స్థాయి 11,210.90 పాయింట్ల మధ్య కదలాడింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్ల (ఎఫ్‌పీఐల) ట్రేడింగ్ ధోరణిలో మార్పులు వచ్చిన సూచనలు కనిపించలేదు. మంగళవారం కూడా ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 1,143.73 కోట్ల విలువ గల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 264.66 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు. మొహర్రం పండుగను పురస్కరించుకొని గురువారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. ప్రపంచ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, రూపాయి విలువ కోలుకున్నప్పటికీ అధిక ముడి చమురు ధరల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ బుధవారం అత్యధికంగా 3.03 శాతం నష్టపోయింది. మారుతి సుజుకి 2.30 నష్టంతో రెండో స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, అదాని పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, ఐటీసీ లిమిటెడ్, ఎస్‌బీఐ, రిల్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఆసియన్ పెయింట్స్, వేదాంత ఉన్నాయి. ఇందుకు భిన్నంగా కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో బుధవారం లాభపడ్డాయి.