బిజినెస్

రూపాయిపై ఒత్తిడి ఇప్పట్లో ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: రూపాయి విలువ పతనం సమస్య ఇప్పట్లో తీరేట్లు లేదు. సమీప భవిష్యత్తులో కూడా ఇది కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్లే రూపాయి విలువ పతనం అవుతోంది. ఈ పతనం ఆగిపోయి, రూపాయి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజా నివేదిక ఒకటి ఈ విషయం వెల్లడించింది. భారతదేశ ఆర్థిక పరిస్థితిపై డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అంచనా ప్రకారం ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ బలపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరమయిన ఆంక్షలు మున్ముందు కూడా కొనసాగుతాయి. ఇవన్నీ కూడా రూపాయి మారకం విలువ పతనం కావడానికి ఒత్తిడిని పెంచే అంశాలే. ‘వాణిజ్య ఒప్పందాలు తిరిగి అమలు కావడంతో పాటు భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరగడం, వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు వంటివి భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల విలువ పతనాన్ని కొనసాగిస్తాయి’ అని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త అరుణ్ సింగ్ ఒక రీసెర్చ్ నోట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలలో అనిశ్చితి, ప్రపంచ మార్కెట్లలో డాలర్ చలామణి జటిలం కావడం వంటి పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో కనీసం రూపాయి విలువకు మద్దతుగా విదేశీ మదుపరులను ఆకర్షించడానికి తీసుకునే చర్యలు సమీప భవిష్యత్తులో కొంతవరకయినా ప్రభావం చూపుతాయి. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, భయాలు, ముడి చమురు ధరలు పెరిగిన తరువాత అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 శాతానికి పైగా పతనమయింది. ఇందులో ఆగస్టు నెల నుంచే దాదాపు ఆరు శాతం పతనమయింది. అయితే, డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం తిరిగి పుంజుకుంది. ఒక్క రోజులోనే 61 పైసలు పెరిగి, 72.37 వద్ద ముగిసింది. రూపాయి విలువను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యల గురించి ప్రస్తావిస్తూ ఈ చర్యలు ప్రాథమికమయినవేనని, మరిన్ని చర్యలు తీసుకోవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా నివేదిక అంచనా వేసింది.