బిజినెస్

నాలుగోరోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ శుక్రవారం భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా మదుపరులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీల) షేర్లలో భారీగా అమ్మకాలకు పూనుకోవడం వల్ల శుక్రవారం సెషన్ మధ్యలో మార్కెట్ కీలక సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ముఖ్యంగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారం మధ్యాహ్నం సెషన్‌లో ఒక్కసారిగా 1,100కు పైగా పాయింట్లు పతనమయింది. ఈ నాలుగు సెషన్లలో కలిసి సుమారు రూ. 5.6 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరయింది. బీఎస్‌ఈ సెనె్సక్స్ శుక్రవారం ఉదయం పటిష్టమయిన స్థాయిలోనే ప్రారంభమయినప్పటికీ, మధ్యాహ్నం సెషన్‌లో ఒక్కసారిగా 1,127.58 పాయింట్లు (3శాతం) పతనమయి, ఇంట్రా-డేలో 35,993.64 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే, తరువాత కొద్ది నిమిషాల్లోనే చాలా మట్టుకు కోలుకుంది. మార్కెట్ ఇలా తీవ్ర స్థాయిలో ఊగిసలాటకు గురయింది. చివరకు సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 279.62 పాయింట్ల (0.75 శాతం) దిగువన 36,841.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 1,495.60 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 91.25 పాయింట్లు పడిపోయి, 11,143.10 పాయింట్ల వద్ద ముగిసింది. మదుపరులు విస్తృత స్థాయిలో అమ్మకాలకు పూనుకోవడం వల్ల సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా పడిపోయాయి. ద్రవ్య చలామణి సంక్షోభం తలెత్తుతుందనే భయం నెలకొనడంతో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల ధర 42 శాతం వరకు పతనమయింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల చెల్లింపులో విఫలమయిందనే వార్తలతో భయాందోళనలు నెలకొని, దాని ప్రభావం ఇతర ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలపైనా పడింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 28.71 శాతం నష్టపోయింది. యెస్ బ్యాంక్ వ్యవస్థాపక కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) రాణా కపూర్ పదవీకాలాన్ని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కుదించడం ఆ బ్యాంకు షేర్ల ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. వారం రీత్యా చూస్తే సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా వరుసగా మూడో వారం నష్టపోయాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో సెనె్సక్స్ 1,249.04 పాయింట్లు (3.28 శాతం) పడిపోగా, నిఫ్టీ 372.10 పాయింట్లు (3.23 శాతం) పడిపోయింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం నికరంగా రూ. 2,184.55 కోట్ల విలువ గల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,201.30 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని నష్టపోయిన ఇతర సంస్థల్లో కోటక్ బ్యాంక్, అదాని పోర్ట్స్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, వేదాంత ఉన్నాయి. మరోవైపు, ఓఎన్‌జీసీ అత్యధికంగా 1.95 శాతం లాభపడింది. లాభపడిన ఇతర సంస్థల్లో విప్రో, ఐటీసీ, టీసీఎస్, ఆసియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే, స్థిరాస్తి రంగం సూచీ 3.48 శాతం, బ్యాంకింగ్ 3.13 శాతం, ఫైనాన్స్ 2.51 శాతం చొప్పున నష్టపోయాయి.