బిజినెస్

మోదీ విధానాల వల్లే దిగజారిన బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల బ్యాంకులు దివాలా తీశాయని, ఈరోజు రుణాలు మంజూరు చేసేందుకు కూడా తగిన నిధులు బ్యాంకుల వద్ద లేవని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. ఎగుమతి పరపతి గణనీయంగా పడిపోయిందన్నారు. గత ఏడాది జూన్ 2017లో ఎగుమతి పరపతి రూ.39వేల కోట్లు ఉండగా, ఈ ఏడాది జూన్‌కు రూ.22,300 కోట్లకు దిగజారిందన్నారు. మరోవైపు ఎగుమతులు ఇబ్బడిముబ్బడిగా చేస్తున్నామంటూ కేంద్రం చేసే ప్రకటనల్లో అర్థం లేదన్నారు. నిరర్థక ఆస్తుల విలువ పెరగడానికి బీజేపీ సర్కార్ అనుసరించిన తప్పుడువిధానాలే కారణమన్నారు. బ్యాంకుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం నివేదిక ప్రకారం 2005-06 నుంచి 2015-16 మధ్య పదేళ్లలో 27.1 కోట్ల మంది భారతీయులు దారిద్య్రం నుంచి విముక్తి పొందారన్నారు. దీనికి యూపీఏ ప్రభుత్వం అనుసరించిన మంచి ఆర్థిక విధానాలే కారణమన్నారు. బ్యాంకింగ్ సెక్టార్ రంగం ఆశాజనకంగా లేదన్నారు. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం స్ధూల ఎన్‌పీఏ 11.6 శాతం నుంచి 12.2 శాతానికి పెరుగుతుంది. ఈ వత్తిడి నిరంతరం పెరుగుతూనే ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసిందన్నారు. 11 జాతీయ బ్యాంకులను ఆదుకునేందుకు కసరత్తు జరుగుతున్నా, ఈ బ్యాంకుల ఎన్‌పీఏ 21 శాతం నుంచి వచ్చే ఏడాదికి 22.8 శాతానికి ఎగబాకుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసిందన్నారు.