బిజినెస్

2.58 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్న చైనా అప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 23: చైనాను అప్పులు సాలెగూడులా కబళిస్తూ దేశ ప్రగతికి ప్రతిబంధకంగా మారాయి. ఇప్పటికే ఈ రుణాలు 2.58 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయని ఆదివారం నాడిక్కడ విడుదలైన ఓ ప్రకటన స్పష్టం చేసింది. ఈ యేడాది రుణాలు 21 ట్రిలియన్ యువాన్‌లకు మించకూడదని అత్యున్నత చట్టసభ నిర్ధేశించింది. కాగా గడచిన ఆగస్టు నాటికి చైనా రుణ బకాయిలు 17.66 ట్రిలియన్ యువాన్లు (2.58 అమెరికన్ డాలర్లు)గా ఉంది. ఇది ప్రభుత్వ లక్ష్యానికన్నా తక్కువగానే ఉందని గ్జిన్‌హువా అనే వార్తా సంస్థ తెలియజేసింది. అయితే కొన్ని రహస్య రుణాలు అంతకంతకూ పెరుగుతూ ఆర్థికాభివృద్ధి పరుగుకు కళ్లెం వేస్తున్నాయని అక్కడి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత యేడాది దేశ వృద్ధిరేటు ఇతర అభివృద్ధిచెందిన దేశాలతో పోలిస్తే 32.2 శాతం తగ్గుదల నమోదైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్థానిక సంస్థలు రుణాలకు పూచీకత్తు ఉండటం, వివిధ కంపెనీలు బతిమాలి నిర్ధేశిత ముడి సరుకుల ధరలను తగ్గించుకోవడం, రుణాలపై వాహనాలు కొనడం వంటి కారణాల వల్ల స్థానిక ప్రభుత్వాల పరోక్ష అప్పుల భారం పెరుగుతోందని దక్షిణ చైనాలోని హాంకాగ్ నుంచి వెలువడే మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక వివిరించింది. ఈక్రమంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనాలో స్థానిక ప్రభుత్వాలను రుణాలను తగ్గించుకోవాల్సిందిగా చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్ వత్తిడి పెంచుతున్నారు. అయితే రుణాల మత్తుకు అలవాటు పడిన స్థానిక ప్రభుత్వాధినేతలు దేశాధ్యక్షుడి సూచనలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారు.