బిజినెస్

ఎన్‌ఆర్‌ఐలకు భలే ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 23: రూపాయి విలువ పతనం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ప్రవేశపెట్టిన వివిధ నియంత్రణ చర్యల వల్ల స్థిరాస్తి రంగం ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలకు) మరింత లాభప్రదమయినదిగా తయారయిందని నిపుణులు పేర్కొన్నారు. గత వారం రోజులుగా అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ సుమారు 73 వద్ద కదులుతోంది. ‘రూపాయి విలువ పతనం సంస్థాగత పెట్టుబడిదారులతో పాటు వ్యక్తిగత కొనుగోలుదారులకు భారత్‌లోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పెంచింది. గత కొన్ని నెలలుగా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్‌ఆర్‌ఐలు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే సమయంలో స్థిరాస్తి రంగంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి మరింత పెరుగుతోంది’ అని భారత్, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా సీబీఆర్‌ఈ చైర్మన్ అంశుమాన్ మాగజైన్ ఆదివా రం ఇక్కడ ఒక వార్తాసంస్థకు చెప్పారు. భారత స్థిరాస్తి రంగం వ్యాపారం ఏటా రూ. మూడు వేల లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రతి సంవత్సరం ఇందులో 7-8 శాతాన్ని ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేస్తున్నారని అంచ నా. ‘ఎన్‌ఆర్‌ఐలు ప్రతి సంవత్సరం రూ. 21వేల కోట్ల నుంచి రూ. 30వేల కోట్ల వరకు స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు జరుపుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పది శాతం పడిపోయిందంటే, దేశ వాసులతో పోలిస్తే ప్రవాస భారతీయులకు స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లలో పది శాతం డిస్కౌంట్ లభించినట్టు లెక్క’ అని నిసుస్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అమిత్ గోయెంకా పేర్కొన్నారు.